హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ తనిఖీల్లో 31.01 లక్షల అనుమానాస్పద కేసులు గుర్తించి, వారిలో 17.87 లక్షల మంది భార్యాభర్తలు ఇద్దరూ అక్రమంగా లబ్ధి పొందినట్లు తేలింది.
కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అక్టోబర్ 15లోగా తనిఖీలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అక్రమాల రకాలు:ఒకే కుటుంబంలోని భార్యాభర్తలిద్దరూ లబ్ధి పొందడం.
మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై డబ్బులు పొందడం.
భూమి అమ్మిన తర్వాత పాత యజమాని, కొత్త యజమాని ఇద్దరూ లబ్ధి పొందడం.
కేంద్రం భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరిగా చేసిందీ, తదుపరి విడత నిధులను దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది.

