సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో సూపర్డెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాస్ రాజుకు నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం 2011లో నమోదు అయిన ఏసీబీ కేసు కారణంగా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు 25,000 రూపాయల జరిమానా విధిస్తూ హైదరాబాద్ 1వ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు విడుదల చేశారు.
కేసు వివరాల ప్రకారం, 2011 డిసెంబర్ 30న, శ్రీనివాస్ రాజు రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించగా ఏసీబీ అధికారులు “రెడ్-హ్యాండ్ెడ్”గా పట్టుకున్నారు. ఈ లంచం వ్యవసాయ భూముల మ్యుటేషన్ మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీకి సంబంధితంగా అడిగినట్లు నమోదైంది.
1988 చట్టం ప్రకారం, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 1 నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఏసీబీ అధికారులు, న్యాయస్థానం తీర్పును ధృవీకరించారు.

