కోనసీమ జిల్లా, అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకు చేప చిక్కింది. సుమారు 10–12 కిలోల బరువు గల ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది.
వైద్యులు, ప్రోటీన్ అధికంగా ఉండటంతో ఇది కండరాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలిపారు. అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది.

