Tv424x7
Andhrapradesh

ఘోర రోడ్డు ప్రమాదంపై కొప్పాల రఘు ఆవేదన!!

సంగం మండలం, పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దళితుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు, జిల్లా విజిలెన్స్–మానిటరింగ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొప్పాల రఘు మాట్లాడుతూ,

నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన ఏడు మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం దుర్ఘటన కాదని, ఇది ఇసుక మాఫియా నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు.

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.

ప్రమాదానికి కారణమైన సంగం ఇసుక క్వారీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని,

క్వారీ యజమానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, ఇటీవల జరిగిన సంఘటన జిల్లా దళిత ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

TV4-24X7 News

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

TV4-24X7 News

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..

TV4-24X7 News

Leave a Comment