Tv424x7
Andhrapradesh

చల్లభసాయపల్లి రిజర్వాయర్ దగ్గర పార్క్ మందుబాబుల అడ్డాగా మారింది..

చల్లభసాయపల్లి రిజర్వాయర్ పక్కన ఏర్పాటు చేసిన పార్క్‌ ఇప్పుడు మందుబాబుల అడ్డాగా మారిపోయింది. సాయంత్రం అయ్యే సరికి యువకులు, పెద్దవాళ్లు గుంపులుగా చేరి పార్క్‌లోనే మద్యం సేవిస్తున్నారు. తాగి ఖాళీ చేసిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు పార్క్‌లో ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింటోంది.

పర్యాటకులు విసుగెత్తిపోతున్నారుసహజసౌందర్యాన్ని ఆస్వాదించడానికి కుటుంబాలతో వచ్చే సందర్శకులు, చిన్నపిల్లలు మద్యం బాటిల్స్, పొగాకు ముక్కలు చూసి ఇబ్బందిపడుతున్నారు. పార్క్‌లోని వాతావరణం చెడిపోవడంతో స్థానికులు కూడా వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.

ప్రజల ఆవేదన – అధికారుల నిర్లక్ష్యం“ప్రజల విశ్రాంతి కోసం నిర్మించిన పార్క్‌ ఇప్పుడు మద్యం మత్తులో ఉన్నవారి అడ్డాగా మారింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

| సూసైడ్ స్పాట్ గా మారుతున్నదా..? “ఎస్ఆర్ఐటి” కళాశాల…

TV4-24X7 News

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

TV4-24X7 News

మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస..

TV4-24X7 News

Leave a Comment