Tv424x7
Andhrapradesh

అన్నదమ్ముల మధ్య ఆస్తి రగడ…. చివరికి ఇలా…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి రగడ రచ్చ రేపింది.

తల్లి బంగారం కోసం కొంతకాలంగా జరుగుతున్న వివాదం శుక్రవారం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ్ముడు రామకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులు, అన్న నాగిరెడ్డి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో నాగిరెడ్డి భార్య పద్మకు, కుమారుడు అంజిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తల్లి ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములే ఇలా ఒకరినొకరు దాడి చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది.

గ్రామస్తులు ఈ ఘర్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సిలింగ్!!

TV4-24X7 News

ఏపీ DSC పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం..కొత్త పరీక్ష తేదీలు ఇవే

TV4-24X7 News

సూపర్ సిక్స్ సూపర్ హిట్. విజయోత్సవ సభ.. ఇక్కడేనట తెలుసా….

TV4-24X7 News

Leave a Comment