Tv424x7
Andhrapradesh

ప్లాస్టిక్‌ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే యాక్షన్ ప్లాన్ తీసుకువస్తామని తెలిపారు.“మన జీవితాల్లో ప్లాస్టిక్‌ ఒక భాగమైపోయింది. దానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. తిరుమలలో క్రమశిక్షణతో ప్లాస్టిక్‌ నిషేధం అమలవుతున్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కఠినంగా అమలు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

ప్లాస్టిక్‌ నియంత్రణలో రాజకీయ నాయకులు ముందుండాలని సూచించారు.

ఫ్లెక్సీల వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

చిన్నా – పెద్దా ఏ కార్యక్రమమైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అలవాటు మానుకోవాలని పిలుపునిచ్చారు.“ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రజలు భాగస్వామ్యం కావాలి. ఈ మార్పు రాజకీయ నాయకుల నుంచే ప్రారంభం కావాలి” అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Related posts

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదంమోపుతాం: పవన్

TV4-24X7 News

వైకాపా సర్పంచ్ టిడిపి లో చేరిక

TV4-24X7 News

ప్రజలు ప్లాస్టిక్,ఇతర చెత్త వ్యర్దాలను కాలువలు,గెడ్డల్లో వెయ్యరాదు

TV4-24X7 News

Leave a Comment