Tv424x7
Andhrapradesh

దసరా బందోబస్తు సమీక్ష – ఎస్.పి. షెల్కే నచికేత్‌..

ప్రొద్దుటూరు,

ప్రొద్దుటూరు పట్టణంలో దసరా ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డి.ఎస్.పి. కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సబ్‌ డివిజన్‌ సి.ఐలు, ఎస్‌.ఐలు పాల్గొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, క్రైమ్‌ పార్టీలపై నిఘా తప్పనిసరి చేయాలని ఎస్.పి. ఆదేశించారు. నవరాత్రుల సందర్భంగా మహిళల రాక ఎక్కువగా ఉండే కారణంగా దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా స్వీకరించి, వేగంగా పరిష్కరించాలని సూచించారు.

తరువాత ఎస్.పి. గారు అమ్మవారి శాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సమావేశంలో ప్రొద్దుటూరు డి.ఎస్.పి. పి.భావన, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Related posts

కడపలో జడ్పీటిసి యువనేత నరేన్ రామంజుల రెడ్డి మీడియా సమావేశం..

TV4-24X7 News

భారీ కుంభకోణం….కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..!

TV4-24X7 News

రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు

TV4-24X7 News

Leave a Comment