Tv424x7
National

భవిష్యత్తు కోసం ఉప్పెనై లేచిన నేపాల్ యువత..

కాట్మండు,

నేపాల్‌లో యువత ఆగ్రహం అగ్నిపర్వతంలా విరుచుకుపడింది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిషేధం విధించడంతో జెన్‌జీ యువత వీధుల్లోకి దూకింది. శాంతియుత నిరసనలపై సైన్యం, పోలీసులు కాల్పులు జరపడంతో రెండు రోజుల్లో 72 మంది ప్రాణాలు కోల్పోగా, 2,100 మందికిపైగా గాయపడ్డారు.

ప్రజా వ్యతిరేక పాలన, అవినీతి, నిరుద్యోగం, వలసలతో పెరిగిన అసమానతలే ఈ యువత ఉద్యమానికి అసలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. నిరసనకారులు పార్లమెంట్, సుప్రీంకోర్టు, మంత్రుల ఇండ్లను, ప్రభుత్వ కార్యాలయాలను మంటల్లో ఆహుతి చేశారు. మాజీ ప్రధాని భార్యతో పాటు పలువురు నేతలపై దాడులు చోటుచేసుకున్నాయి.

ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రిమిటెన్స్‌పై ఆధారపడి ఉన్న జీవన విధానం యువతను తీవ్ర నిరాశలోకి నెట్టిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 33% విదేశీ డబ్బుపై ఆధారపడి ఉండటం ఆర్థిక దౌర్భల్యానికి నిదర్శనమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

శ్రీలంక, బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమాల తరహాలోనే నేపాల్‌లో కూడా ఈ తిరుగుబాటు చోటుచేసుకోవడం దక్షిణాసియా రాజకీయ వ్యవస్థలకు పెద్ద పాఠమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు..!!

TV4-24X7 News

ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది..?

TV4-24X7 News

మావోయిస్టులు ఆయుధాలు వీడండి: కేంద్ర మంత్రి అమిత్ షా

TV4-24X7 News

Leave a Comment