Tv424x7
Telangana

నేటిలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలి – ఆర్థికశాఖ ఆదేశాలు!


తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ నేటిలోగానే (శనివారం) ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల (సెప్టెంబర్‌) వేతనం వచ్చే నెల 1న సమయానికి విడుదల కావాలంటే, ప్రతి ఉద్యోగి వివరాలు తప్పనిసరిగా పంపాలని శాఖ స్పష్టం చేసింది. ఇకపై ప్రతినెల పదో తేదీలోగా సంబంధిత వివరాలను ఆన్లైన్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని కూడా ఆదేశాల్లో పేర్కొంది.

వేతనాల సమయానుసార చెల్లింపుల కోసం ఈ చర్యలు కీలకమని అధికారులు తెలిపారు.

Related posts

తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తాగునీటి కష్టాలు!!

TV4-24X7 News

ఇందిరమ్మ ఇల్లు ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ – పంచాయతీ కార్యదర్శి ఏసీబీ చేతికి

TV4-24X7 News

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

Leave a Comment