Tv424x7
Andhrapradesh

వారసుల గుప్పిట్లో దేశ రాజకీయాలు!


భారతదేశ రాజకీయాల్లో వారసత్వ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని అసోషియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో దాదాపు 21 శాతం మంది వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినవారేనని అధ్యయనం తేల్చింది.

లోక్‌సభలోనే ప్రస్తుతం 31% మంది ఎంపీలు రాజకీయ కుటుంబాలకు చెందినవారు కాగా, రాష్ట్ర శాసనసభల్లో సగటున 20% మంది అలాంటి వారేనని నివేదిక పేర్కొంది. మొత్తం 5,204 మంది ప్రజాప్రతినిధులలో 1,107 మంది రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు తేలింది.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లో 23%, రాజస్థాన్‌లో 18%, బీహార్‌లో 27%, మహారాష్ట్రలో 32% మంది వారసులు అధికారంలో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 34% తో అగ్రస్థానంలో ఉండగా, కర్నాటకలో 29% మంది వారసులే రాజకీయ ప్రతినిధులుగా ఉన్నారు.

ఏడీఆర్‌ నివేదికలో ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్యానికి సవాల్‌గా మారిందని, ప్రజా ప్రతినిధుల ఎంపికలో కుటుంబ సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేసింది.

Related posts

నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం..?

TV4-24X7 News

మేధోమధనం ద్వారా పౌర సేవల నాణ్యత పెంపు: ముఖ్యమంత్రి సమీక్ష!

TV4-24X7 News

గంగుల ఏ పార్టీ తరపున బరిలో దిగానున్నాడో

TV4-24X7 News

Leave a Comment