నంద్యాల జిల్లాలో దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షల్లో పాల్గొన్నారు.
జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫరూక్, కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ –
🔹 తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించామని
🔹 రిజిస్ట్రేషన్ 2.0 విధానంలో ఆధార్–ఓటీపీ, మొబైల్–ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వంటివి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని
🔹 ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరుతూ, పట్టణ–గ్రామ ప్రజలు తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, భాష, ఆది నారాయణ రెడ్డి, హుసేన్, హబీబ్, నాగలక్ష్మి దేవి, సత్యం, అస్లాం, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
👉 ప్రధాన డిమాండ్: రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానం రద్దు చేయాలి

