తిరుపతి జిల్లా, కమలాపురం :
తిరుపతి జిల్లా కమలాపురంలో వడ్డీ వ్యాపారస్తుడు చేసిన హల్చల్ స్థానికంగా కలకలం రేపింది.
20 రూపాయల వడ్డీకి వృధా మహిళా ఇల్లు లాక్కోవాలని బెదిరిస్తూ, “సీఎం చంద్రబాబు వచ్చినా నీ ఇంటి తాళాలు ఇవ్వను” అంటూ దాడికి పాల్పడ్డాడు.
ఆ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే స్పందించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వడ్డీ వ్యాపారస్తుడు మహిళను చంపేస్తానని బెదిరించడం, “వారంలోపే ఇల్లు లాక్కుంటా” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వైరల్ అవుతున్నాయి.

