Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో డీ-అడిక్షన్ కేంద్రాలకు రూ.33.80 కోట్లు – ప్రతిపాదనలు…

. చలువాదిరాష్ట్రంలో మత్తు పదార్థాల బానిసలైనవారిని విముక్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, మద్యం, గంజాయి, హాష్ ఆయిల్, మత్తు ఇంజక్షన్లు వంటి వ్యసనాల నుండి బాధపడుతున్నవారికి వైద్య సహాయం అందించేందుకు రూ.33.80 కోట్లతో వ్యసన విమోచన కేంద్రాల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

ప్రస్తుతం జిల్లాస్థాయి, బోధనా ఆసుపత్రుల్లో ఉన్న 21 డీ-అడిక్షన్ సెంటర్లకు వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతులు, సాంకేతిక వ్యవస్థ, సిబ్బంది ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాల కోసం నిధులు వినియోగించనున్నారు.

2023-24లో 18,147 మంది ఇన్-పేషెంట్లు సేవలు పొందగా, 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు 22,909 మంది చికిత్స పొందినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, విలువలు మరియు ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

విశాఖపట్నం ప్రత్యేక పరిస్థితివిశాఖలో వ్యసనబారినపడిన వారి సంఖ్య పెరుగుతుండటంతో అదనంగా 4 డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సీఎం చంద్రబాబును కోరారు.

ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారం సామర్థ్యం 950 మందే ఉన్నా, గంజాయి కేసులతో 2,000 మందికి పైగా ఖైదీలు ఉండటాన్ని హోంమంత్రి అనిత వెల్లడించారు.

దీనితో జైలు ఆధునీకరణలో భాగంగా అక్కడ కొత్త డీ-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

మానసిక వైద్యుల సూచన:చిన్న వయసులోనే మత్తుకు అలవాటు పడితే వెంటనే గుర్తించి కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాలి. ఒంటరిగా వదిలేయకుండా వెంటనే డీ-అడిక్షన్ సెంటర్‌కు తీసుకెళ్లడం అవసరం అన్నారు.

Related posts

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

విజయవాడలో మహా నవమి: మహిషాసుర మర్దిని దర్శనం!!

TV4-24X7 News

వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు.. అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు :- మంత్రి రోజా

TV4-24X7 News

Leave a Comment