Tv424x7
Andhrapradesh

చిత్తూరు జిల్లా అల్లర్లు.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు..

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట సర్కిల్ వద్ద దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ప్రజలు, దళిత సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. “నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠిన శిక్షలు విధించాలి” అని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందయ్య అక్కడికి చేరుకున్న నగరి డీఎస్పీ కాళ్లు పట్టుకుని మరీ విన్నవించారు. “మాకు న్యాయం చేయండి సార్, విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని శిక్షించండి” అని వేడుకున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

తమిళనాడులో అరుణాచలేశ్వరుని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి భాస్కర రావు

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన.

TV4-24X7 News

Leave a Comment