శివమొగ్గ జిల్లా గుండితిమ్మనహళ్లి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, మానసిక ఆవేదన కారణంగా ఓ తల్లి తన 12 ఏళ్ల కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకుంది.
మృతులు శృతి(38), పూర్విక(12)గా గుర్తించారు. భర్త ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చే సరికి ఇద్దరి మృతదేహాలు కనపడటంతో తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శృతి మానసిక సమస్యలతో బాధపడుతూ ఈ ఘోరానికి పాల్పడిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది

