Tv424x7
Telangana

హైదరాబాద్‌లో మరో పెట్రోల్ బంక్ వివాదం

హైదరాబాద్‌, షెర్రిగూడ

హైద్రాబాద్ లో మరో పెట్రోల్ బంక్ వివాదం వెలుగుచూసింది. షెర్రిగూడ పరిధిలోని హెచ్‌పీసీఎల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోల్‌ను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి.

నిన్న రాత్రి తన బ్రెజా కారులో పెట్రోల్ నింపించుకున్న మహేష్ అనే వ్యక్తి, ఈ రోజు వాహనం ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు వెళ్లగా, ఇంధనంలో నీరు కలిసిందని వెల్లడించారు.

అసలు విషయం తెలుసుకోవడానికి మహేష్ తిరిగి బంక్‌కు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్ నింపించగా, అందులోనూ నీరు స్పష్టంగా కనిపించడంతో అక్కడే బంక్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వినియోగదారులను మోసం చేసే ఇలాంటి బంక్‌లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అనూష

Related posts

రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమకు డేట్‌ ఫిక్స్!!

TV4-24X7 News

వీఆర్వోలు – కొత్త ఉద్యోగులా, పాత చొక్కాలో కొత్త పేరులా?

TV4-24X7 News

యువకుడిని కర్రలతో కొట్టి హత్య ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment