Tv424x7
Telangana

యువకుడిని కర్రలతో కొట్టి హత్య ఎందుకో తెలుసా..?

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఓ ప్రేమకథ ఘోరానికి దారి తీసింది. అదే గ్రామానికి చెందిన సతీష్ (25) కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, సతీష్ వెనకడుగు వేయలేదు.ఇక ఇటీవల యువతికి వేరే సంబంధం చూసిన కుటుంబసభ్యులు సతీష్‌ను మరల దూరంగా ఉండమని హెచ్చరించారు. దీనితో మనస్తాపానికి గురైన సతీష్, ఆ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని పేర్కొంటూ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.ఈ విషయం తెలిసి ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్ ఇంటికెళ్లి కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే సతీష్ మృతిచెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.👉 గ్రామంలో ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల ఆందోళన..

TV4-24X7 News

నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి: హరీశ్ రావు

TV4-24X7 News

కేటీఆర్ విచారణ – ఇంటికా? జైలుకా..?

TV4-24X7 News

Leave a Comment