హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.10 వేల కోట్లను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము నష్టాలను భరించలేమని స్పష్టం చేశారు.
👉 బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలను మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే రోజు జరుపుకునే ఇంజనీర్స్ డే ను “బ్లాక్ డే”గా పాటిస్తామని ప్రకటించారు.
📌 ఈ మేరకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను కలిసి తమ డిమాండ్లను వివరిస్తూ నోటీసులు అందజేశారు.
⚠️ బకాయిల చెల్లింపులో జాప్యం కొనసాగితే, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

