Tv424x7
Telangana

యూరియా సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష!!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చివరకు నిద్రలేచారు. గత రెండు నెలలుగా ఎరువుల కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పంటలు దెబ్బతింటున్నాయని ఆరోపణలు చేశారు. యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు క్యూలలో నిలబడటం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థలోని లోపాలు, కేంద్రం నుంచి వచ్చిన కేటాయింపులు, రైతులకు ఎరువులు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరగనుంది.

రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే తీవ్ర ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Related posts

కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?

TV4-24X7 News

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లి కొడుకు కానిస్టేబుల్ సస్పెండ్.. ఫోక్సో కేసు నమోదు

TV4-24X7 News

తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ధి ఉత్సవాలు

TV4-24X7 News

Leave a Comment