సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పంచాయతీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సమాచారం ప్రకారం, సోమిరెడ్డి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో –
👉 “ప్రతి నెలా జీతం వచ్చి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు”
👉 “మీ అందరితో కలిసి నేనూ పనిచేయాలని అనుకున్నాను, కానీ ఆర్థిక పరిస్థితులు నన్ను ఈ నిర్ణయానికి నెట్టేశాయి” అని వేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు, సహచర ఉద్యోగులు ఆయన మరణంపై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
📌 పంచాయతీ సిబ్బందికి జీతాలు నెలల తరబడి నిలిపివేయడం పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాలంటూ కుటుంబసభ్యులు, సహచరులు డిమాండ్ చేస్తున్నారు.
👉 అధికారుల అలసత్వం, జీతాల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

