కడప /మైదుకూరు టౌన్ (30 సెప్టెంబర్):పట్టణ ప్రజలకు పందుల సంచారం ఇబ్బందులు తెస్తోంది. కడప రోడ్డులో మంగళవారం ఉదయం మరోసారి పందుల కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనులకు కూలీలతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా పంది ఎదురురావడంతో డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పాడు. ఈ క్రమంలో ఒక మహిళ కిందపడి తలకు గాయమైంది.ఇటీవల కూడా ఇదే ప్రాంతంలో గర్భిణి మహిళతో వెళ్తున్న బైక్‌కు పంది అడ్డుగా రావడంతో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీ పరిధిలో పందుల సంచారం రోజురోజుకు పెరిగిపోతుండటంతో పట్టణ వాసులు విసికెత్తిపోతున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఈ పందుల బెడదను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీని కోరుతున్నారు.
previous post

