Tv424x7
Andhrapradesh

చిత్తూరు జిల్లా అల్లర్లు.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు..

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట సర్కిల్ వద్ద దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో ప్రజలు, దళిత సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. “నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, కఠిన శిక్షలు విధించాలి” అని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందయ్య అక్కడికి చేరుకున్న నగరి డీఎస్పీ కాళ్లు పట్టుకుని మరీ విన్నవించారు. “మాకు న్యాయం చేయండి సార్, విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని శిక్షించండి” అని వేడుకున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

గంజాయి బ్యాచ్‌ల ఆట కట్టించేందుకు రంగంలోకి స్నిఫర్‌ డాగ్స్‌

TV4-24X7 News

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

TV4-24X7 News

అమరావతిలో సీబీఐ కార్యాలయానికి భూమి కేటాయింపు !

TV4-24X7 News

Leave a Comment