మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మద్యం అలవాటు మానుకోవాలని భార్య పలుమార్లు మందలించడంతో భర్త ఆగ్రహానికి గురయ్యాడు. గొడ్డలితో భార్యపై దాడి చేసి మెడపై తీవ్రంగా గాయపరిచాడు.
రక్తపు మడుగులో కుప్పకూలిన బాధితురాలను స్థానికులు తీవ్ర గాయాలతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

