నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, సంత జూటూరు గ్రామం:గత నెల 12-08-2025న ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో మీడియా సాక్షిగా ఆర్.ఎం.పీ వైద్యుడు ఎన్. పరశురాం నిర్వహిస్తున్న హాస్పిటల్, మెడికల్ షాప్, ల్యాబ్‌లను సీజ్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు అదే హాస్పిటల్ మరియు మెడికల్ షాప్ మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తుండటం గ్రామస్థుల్లో ఆగ్రహానికి కారణమైంది.గ్రామస్థుల వివరాల ప్రకారం, జ్వరం, నొప్పులతో బాధపడుతున్న అడ్డాకుల శ్రీనివాసులు (తండ్రి: చిన్న సుబ్బరాయుడు) ఆగస్టు 12న పరశురాం దగ్గరకు చికిత్స కోసం వెళ్లగా, ఆయన హెచ్చరించినప్పటికీ స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ప్రాణాపాయం వాటిల్లిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఇటీవల 7-09-2025న ఉదయం “సూర్య ప్రేమ్ మెడికల్ స్టోర్” తెరిచి, ఫార్మసిస్ట్ లేకుండా ఔషధాలు విక్రయిస్తున్నట్లు స్థానికులు గమనించారు. టెన్త్, ఇంటర్ చదివిన యువకులతో షాప్ నడిపిస్తూ, బిల్లులు లేకుండా మందులు విక్రయించడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని గ్రామస్థులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై జిల్లా ఉన్నత వైద్యాధికారులు వెంటనే స్పందించి ఆ హాస్పిటల్, మెడికల్ షాప్‌లను మళ్లీ సీజ్ చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఎం.ఎస్.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి పూల వెంకట సుబ్బన్న మాదిగ, మండల అధ్యక్షుడు ఏ. చిన్న సుబ్బరాయుడు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు శివ మాదిగ, ఉపాధ్యక్షుడు పాలుట్ల సురేష్ మాదిగ, ఎం.ఎస్.ఎఫ్. మండల అధ్యక్షుడు తిరుపతి మాదిగ తదితరులు భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


