Tv424x7
Andhrapradesh

బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు.. అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్!

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ జగన్ అన్నారు—“అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఒకటి, ఆయన మాట్లాడింది ఇంకోటి. అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కి బుద్ధి లేదేమో?” అని తీవ్రంగా మండిపడ్డారు.జగన్ ఇంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితిపై కూడా వ్యాఖ్యానించారు.“ఆయన సైకాలజికల్ హెల్త్‌ ఏ స్థాయిలో ఉందో ఆ మాటల ద్వారానే తెలుస్తుంది. తాను ఎలా ఉన్నాడో బాలకృష్ణనే ఆలోచించుకోవాలి,” అన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ చర్చ ప్రారంభించారు. దానిని కొనసాగిస్తూ బాలకృష్ణ జగన్, చిరంజీవి పేర్లను ప్రస్తావించడం పెద్ద దుమారానికి దారితీసింది.ఈ నేపథ్యంలో, బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి అప్పటికే స్పష్టం చేశారు—“జగన్ ప్రభుత్వం కాలంలో ఎలాంటి అవమానం జరగలేదు. ఆయన గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారు,” అని తెలిపిన విషయం తెలిసిందే.

Related posts

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

TV4-24X7 News

కదులుతున్న రైలులో నుండి దూకి ఇద్దరికీ గాయాలు

TV4-24X7 News

మార్చిలోనే ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

TV4-24X7 News

Leave a Comment