Tv424x7
AndhrapradeshCrime News

పూసుగూడెం భూమి రిజిస్ట్రేషన్‌కి లంచం – ఏసీబీ ఉచ్చు బారిన బానోత్‌ శ్రీనివాస్ నాయక్‌..

📍భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ములకలపల్లిములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బారిన పడిన గ్రామ పరిపాలనాధికారి!

ఏసీబీ అధికారుల ఉచ్చు బారిన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే— వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.60 వేల లంచం డిమాండ్ చేసిన ఆయన, ఇప్పటికే రూ.40 వేల రూపాయలు స్వీకరించినట్లు సమాచారం. మిగిలిన రూ.15 వేల లంచం తీసుకుంటూ ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Related posts

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

TV4-24X7 News

మసీదు లోకి మహిళలను అనుమతించాలి: సుప్రీంకోర్టు

TV4-24X7 News

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి దుమారం.. ఏఆర్ డైరీలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment