Tv424x7
Andhrapradesh

తుఫాన్ ప్రభావంలో మానవతా సేవకు ఉదాహరణ

తూర్పు గోదావరి జిల్లా డుంబ్రిగుడ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సాకేరి అనితకు మంగళవారం ఉదయం ప్రసవవేదన మొదలైంది. తుఫాన్ ఉధృతి మధ్య 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన బయల్దేరారు.

కానీ మార్గమధ్యంలో గెడ్డవాగు ఉప్పొంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆపదను లెక్కచేయకుండా 108 పైలట్ సురేష్‌ గర్భిణీని మోసుకుంటూ వాగు దాటించి సురక్షితంగా మరోవైపు చేర్చాడు. అనంతరం ఆమెను డుంబ్రిగుడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తుఫాన్ ప్రభావం మధ్య మానవతా విజయం – 108 సిబ్బంది ధైర్యసాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

TV4-24X7 News

ప్రకాశం జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం – తండ్రి చనిపోయిన చోటే కొడుకు కూడా మృతి.

TV4-24X7 News

ఏపీలో 108, 104 సర్వీసుల నుంచి ‘అరబిందో’ ఔట్!

TV4-24X7 News

Leave a Comment