Tv424x7
Andhrapradesh

ఆంధ్ర పోటీలను ప్రారంభించిన….. ఎమ్మెల్యే మేడా.

అన్నమయ్య జిల్లా, ఒంటిమిట్టలో గురువారము రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. అడుధాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానం నందు క్రికెట్ పోటీలను ప్రారంభించి, ముందుగా ఇరుజట్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు కొద్దిసేపు క్రికెట్ ను ఆడారు. ఎమ్మెల్యే మాట్లాడుతు. రాష్ట్రంలో నిన్నటి నుంచి ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయని ఇవి దేశ చరిత్రకే ఓ మచ్చుతునకగా విలుస్తాయన్నారు. 47 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీల పండుగలో గ్రామీణ యువ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాను చాటు కోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసి దేశానికి పరిచయం చేయాలన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అంతేకాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం, రుగ్మతల నివారణకు ఎంతగానే ఉపకరిస్తాయన్నారు. వ్యాయామం క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆర్యోగ సరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. మానవుని జీవన శైలిలో వ్యాయామం ఒక ముఖ్యమైన అంశంగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు రెడ్డి, జే సి ఎస్ మండల కన్వీనర్ రఘురాం రెడ్డి, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రఫీ, స్కూల్ చైర్మన్ అస్మత్, సర్పంచులు కత్తి. సుజాత, వెంకట్ రెడ్డి ,భాషా, p. చంద్ర ,తక్కువలి శివారెడ్డి, లంక రామ్ రెడ్డి , కృష్ణారెడ్డి కట్టా నారాయణ , భాస్కర్ రెడ్డి , బ్రహ్మానంద్ రెడ్డి, మంత్రి శివారెడ్డి, మాజీ సర్పంచ్ కె.వి వెంకటసుబ్బయ్య , సిద్ధవటం మండల యూత్ కన్వీనర్ వావిళ్ళ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, రావుల సుబ్బారెడ్డి , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పనికొస్తారని భావిస్తేనే టికెట్‌ ఇస్తారు’.. వచ్చే ఎన్నికల్లో పోటీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.

TV4-24X7 News

యూజర్లకు జియో మరో షాక్!”

TV4-24X7 News

ఎర్రగుంట్ల మండలం కలమల్ల లో CPUSI కార్యవర్గ సమావేశం

TV4-24X7 News

Leave a Comment