Tv424x7
Andhrapradesh

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు..శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.

Related posts

కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్.ఐ

TV4-24X7 News

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో అవకతవకలపై ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

TV4-24X7 News

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

TV4-24X7 News

Leave a Comment