అనంతపురం :అల్లర్లు, గొడవలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఇటుకలపల్లి సి.ఐ నరేంద్రరెడ్డి సూచించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు ఎస్సై మునీర్ అహ్మద్ తో కలిసి ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజలతో సమావేశమై గ్రామాలలో ప్రశాంతత లోపించకుండా అందరూ సహకరించాలన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అందరూ స్నేహపూర్వకంగా మెలగాలన్నారు.

