Tv424x7
Andhrapradesh

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి- పక్కా గృహాలను వెంటనే పూర్తి చేయాలి- మండల ప్రత్యేక అధికారి మైకేల్ రాజీవ్

ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల ప్రత్యేక అధికారి మైఖేల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం దువ్వూరు మండల ప్రత్యేక అధికారిగా జిల్లా ఆర్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ రాజీవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుగుణ శ్రీ, తహసిల్దార్ ఉమారాణి, ఇతర మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్ర మానికి మండలంలోని అధికారులందరూ హాజరు కావాలని సూచించారు. అధికారులందరూసమన్వయంతో పనిచేసి నప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చు అని ఆయన సూచించారు. మండలంలో నిర్మిస్తున్న ప్రభుత్వ పక్కా గృహాలను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. మండలంలోని సమస్యలను తెలుసుకొని ప్రజలను ఆఫీసు చుట్టూ తిప్పు కోకుండా పరిష్కరించాలన్నారు. మండలంలోని సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఉమారాణి, మండల అభివృద్ధి అధికారి సుగుణ శ్రీ , హౌసింగ్ ఏఈ వైశాంతి ,పంచాయతీరాజ్ ఏఈ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్, ఉపాధిహామీ ఎపిఓ డాక్టర్ వసంత కుమార్, వెలుగు ఏపిఎం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!

TV4-24X7 News

నిన్న శ్యామల ఇవాళ అంబటి – రేవంత్ అంత చులకనయ్యారా ?

TV4-24X7 News

వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారికి పోలీసు వారి ముఖ్య సూచనలు

TV4-24X7 News

Leave a Comment