Tv424x7
Andhrapradesh

రహదారులపై దుకాణాలను తొలగిస్తున్న వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు

విశాఖపట్నం దుకాణాల్లోని వ్యాపార వస్తువులను పుట్ పాత్ , రహదారులపై పెట్టి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు వ్యాపారులను హెచ్చరించారు. పూర్ణ మార్కెట్ దుకాణదారులు సామగ్రిని రోడ్డుపై ఉంచడంతో వాహన రాకపోకలకు అవరో ధంగా మారింది. కొన్నిచోట్ల ఫుట్ పాత్ పూర్తిగా ఆక్రమించి, పాదచారులకు నడి చే వీలులేకుండా చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో వన్ టౌన్ పోలీసులు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ, ఎస్ ఐ ఆధ్వర్యంలో వ్యాపారులకు హచ్చరికలు జారీ చేసి, సామగ్రిని తీయించారు. మరోసారి ఇలా కనిపిస్తే రోడ్డుపై ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల చర్యలపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తరచూ స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రొద్దుటూరుఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

TV4-24X7 News

గుడివాడ అమర్నాధ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ద్రోణంరాజు శ్రీవత్సవ

TV4-24X7 News

ప్రొద్దుటూరు: 12, 13 తేదీల్లో నీటి సరఫరా బంద్

TV4-24X7 News

Leave a Comment