Tv424x7
Andhrapradesh

రాజధానిలో భవనాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి నారాయణ

అమరావతి: తెదేపా హయాంలో నిర్మించిన భవనాలు, రోడ్ల నిర్వహణను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ప్రత్యేక పూజల అనంతరం జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆయన ప్రారంభించారు..అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 24వేల ఎకరాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపడతామని.. నెలలోపు ఆ పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతను ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించారని.. త్వరలో ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు.250 పొక్లెయిన్ల సాయంతో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టారు. దీనికోసం రూ.36కోట్లు కేటాయించారు. ముళ్ల చెట్లు తొలగించాక అమరావతిలో కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు స్థలాలను అప్పగించనున్నారు.

Related posts

రైతులను మభ్యపెట్టి రాజకీయాలు చేయొద్దు : ఏపీ రవీంద్ర

TV4-24X7 News

ఈనెల 9న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం: హాజరుకానున్న నరేంద్ర మోడీ?

TV4-24X7 News

ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల

TV4-24X7 News

Leave a Comment