అయ్యప్ప స్వాములకు ఆసరాగా ఉంటాం
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖపట్నం మాల ధరించే అయ్యప్ప, భవాని భక్తుల అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10 వేలు విరాళం అందజేశారు. సోమవారం ఆశీలమెట్ట కార్యాలయంలో 33వ వార్డు అల్లిపురం బంగారం మెట్ట కాలనీ బూరెల చిన్న ఆధ్వర్యంలో మాలధారణ భక్తుల అన్నదానానికి రూ. 10 వేలు సొంత నిధులను అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కార్తీక మాసంలో అయ్యప్పస్వామి, శ్రీ కనకదుర్గమ్మలను భక్తిశ్రద్ధలతో 41 దినములు మాలధరించే భక్తులకు అన్నదానం, కైంకర్యం నకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్తీక మాసంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో దైవచింతన పెంచుతోందన్నారు. తాను చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా మాలధారణ భక్తులకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సనపల రవీంద్ర భరత్, దక్షణ వైసీపీ నేతలు గనగల్ల రామరాజు,వాసు తదితరులు పాల్గొన్నారు.

