Tv424x7
Andhrapradesh

బాలిక ఆచూకీ గుర్తించి ఆమె తల్లికి అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

విశాఖపట్నం కుటుంబ మనస్పర్థలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మైనర్ బాలిక ఆచూకీ గుర్తించి ఆమె తల్లికి అప్పగించిన నగర వన్ టౌన్ పోలీసులు. కుటుంబ సభ్యుల పై అలిగి వెళ్లిపోయిన బాలిక కోసం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసును నమోదు చేసి, తక్షణం విచారణ చేపట్టి,సోమవారం హొసదరు మైనర్ బాలికను విజయనగరం నందు గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి,ఆమె తల్లికి సోమవారం అప్పగించడం జరిగినది. తప్పిపోయిన కుమార్తెను తిరిగి భద్రముగా అప్పగించిన వన్ టౌన్ సి.ఐ జి.డి. బాబు కి, స్టేషన్ సిబ్బంది కి, విశాఖ నగర పోలీసులకు బాలిక తల్లి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి,ఐ.పి.ఎస్., బాలిక ని గుర్తించి,ఆమె తల్లికి అప్పగించిన సిబ్బందిని అభినందించారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపిపోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి

TV4-24X7 News

ఏపీఆర్ఎస్ 5వ తరగతి, ఏపీఆర్ఎస్ 6-7-8 తరగతుల బ్యాక్‌లాగ్, ఏపీఆర్‌జేసీ & ఏపీఆర్‌డీసీ సెట్ 2025 హాల్ టిక్కెట్లు విడుదల*

TV4-24X7 News

తప్పు లేకుండానే పుట్టా సుధాకర్ భయపడ్డాడా?

TV4-24X7 News

Leave a Comment