Tv424x7
Telangana

లారీ- ఆర్టీసీ బస్సు ఢీ.. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్‌ సలీం అక్కడికక్కడే మృతి చెందగా..ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న డీలక్స్‌ బస్సు.. లారీని వెనకవైపు నుంచి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవరు మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సహాయంతో బయటకి తీశారు..క్షతగాత్రుల్లో కొందరిని హైదరాబాద్‌ తరలించగా.. మరికొందరిని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాద ఘటనతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది..

Related posts

tv9 విలేకరికి బెదిరింపులు ఎస్పీ కి ఫిర్యాదు

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి,ఫ్లవర్ అనుకుంటి రా ఫైర్

TV4-24X7 News

జగిత్యాల జిల్లా లో విషాద ఘటన….

TV4-24X7 News

Leave a Comment