నంద్యాలలోని స్థానిక టీడీపీ కార్యాలయం (రాజ్ టాకీస్) వద్ద ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, రజక సంఘం నాయకులు మరియు టీడీపీ జిల్లా నాయకుల నేతృత్వంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ను కలిసినపుడు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో రజకులపై జరుగుతున్న దాడులను ఆపాలని, రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, దోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని, రజకుల ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలి, కార్పొరేషన్ ద్వారా అవసరమైన పనిముట్లను అర్హులైన రజకులకు ఇవ్వాలని, దేవాలయాలలో లాంతర్లను పట్టే వృత్తంలో రజకులకు కమిటీ సభ్యులుగా అవకాశాలు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ సానుకూల స్పందన వ్యక్తం చేసి, పై అంశాలను సంబంధిత శాఖలకు తెలియజేస్తానని, అలాగే మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు.

