Tv424x7
Andhrapradesh

వివాదాలకు కారణమైన ఉచిత బస్సు పథకం.. ఏమైందో తెలుసా…

ఎన్టీఆర్ జిల్లా – నందిగామ

ఉచిత బస్సు పథకం మరోసారి వివాదాలకు కారణమైంది.

పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు బయలుదేరిన బస్సులో సీట్ల కోసం మహిళలు తీవ్రంగా ఘర్షణకు దిగారు.మాటలతో మొదలైన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి, మహిళలు ఒకరిపై ఒకరు వాటర్‌ బాటిళ్లతో దాడి చేసుకున్నారు. బస్సులో ఉన్న పురుషులు గొడవలు ఆపాలని ప్రయత్నించినా, మహిళలు పట్టించుకోకపోవడంతో నందిగామ వరకు కలహం కొనసాగింది.

ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉచిత బస్సు పథకం సద్వినియోగం కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

రోడ్ ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్

TV4-24X7 News

తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

TV4-24X7 News

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

Leave a Comment