GST తగ్గింపుతో 140 కోట్ల మందికి ఉపశమనం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ –
ఈ నెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుందని వెల్లడించారు.
350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి అని స్పష్టం చేశారు.
GST తగ్గింపు అమలు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రజలకు ఈ ప్రయోజనం నిజంగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి అని సూచించారు.
ఇకపై ప్రతి షాప్‌లో “GST తగ్గింపు బోర్డు” తప్పనిసరిగా కనిపించనుంది.

