Tv424x7
Crime NewsNational

అస్సాంలో సివిల్‌ సర్వీస్‌ అధికారిణి అరెస్ట్‌… ఎందుకో తెలుసా..?

అస్సాం రాష్ట్రంలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సివిల్‌ సర్వీస్‌ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో భూ కుంభకోణానికి సంబంధించి పోలీసులు నుపుర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఇంటి నుండి రూ.90 లక్షల నగదు, రూ.1 కోటి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం అయ్యాయి.

ఈ సంఘటనతో అస్సాం పరిపాలనా వర్గాల్లో కలకలం రేగింది. అధికారులు మరిన్ని ఆస్తుల వివరాలు, సంబంధిత వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

త్వరలో కూతపెట్టనున్న హైడ్రోజన్ రైలు

TV4-24X7 News

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

TV4-24X7 News

డోంట్ కేర్ – అమెరికాకు భారత్ రిప్లై!

TV4-24X7 News

Leave a Comment