అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బార్ పాలసీ ప్రకారం, రాష్ట్రంలో కొత్త బార్ల అనుమతుల కోసం రెండో విడత లాటరీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ఈరోజు (గురువారం) నిర్వహిస్తోంది.
రెండో విడతలో మొత్తం 428 బార్ల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, తొలి దశలో ఆశించినంతగా దరఖాస్తులు రాలేదు. దీనితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నిబంధనల్లో సవరణలు చేయడంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
అదనంగా, బార్లపై ప్రస్తుతం విధిస్తున్న ఏఆర్టిఓటీ పన్ను (Annual Rental Turnover Tax) తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు 15 శాతం పన్ను ఉండగా, దీనిని 6 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రెండో విడత లాటరీ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వందల సంఖ్యలో బార్లు ప్రారంభం కానున్నాయి.

