అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయని, ప్రజలకు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నప్పటికీ మద్యం మాత్రం ఏరులై పారుతోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు తోట త్రిమూర్తులు.
టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు పక్కనబెట్టి, నాయకులు అక్రమ మద్యం దందాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

