నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి సంచలనం.ఓ దుండగుడు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి హెడ్ కానిస్టేబుల్ టి. నారాయణపై కత్తితో దాడి చేశాడు.
నారాయణ కడుపు పైభాగంలో గాయాలు కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన హోంగార్డు గిరిధారి కూడా గాయపడ్డాడు.
వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో దుండగుడు పరారయ్యాడు.
గాయపడిన ఇద్దరినీ భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వ్యక్తి అయ్యే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లోనే ఇలా దాడి జరగడం స్థానిక ప్రజల్లో ఆందోళన రేపుతోంది.
నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు ప్రారంభించారు.

