Tv424x7
Andhrapradesh

ఐరన్ బ్రిడ్జీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చర్యలు!!

ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు ప్రధాన కార్యదర్శి డా. సి. సువర్ణ ను కలసి ఐరన్ బ్రిడ్జీల నిర్మాణానికి తగిన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని అభ్యర్థించారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వివరించినట్లయితే, ఉట్నూర్, పెంబి మండలాల్లో మొత్తం 6 బ్రిడ్జీల నిర్మాణానికి సుమారు ₹17.92 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ నిర్మాణాల ద్వారా స్థానిక ప్రజల రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈనిధులు ఇప్పటికే విడుదలై ఉన్నాయి.

అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సరిపడినంత ఇసుక, బండ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందజేయాలని ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ గారికి వినతిపత్రం ద్వారా కోరారు. ఇల్లు నిర్మాణాలు నిర్దిష్ట సమయానికి పూర్తి చేయడానికి అవసరమైన వనరుల సమగ్ర సరఫరా అందించాలన్నారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రజల రవాణా సౌకర్యం మరియు ఇళ్ల నిర్మాణ పనులపై ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకుంటుందని, వీటితో స్థానికుల సమస్యలకు సమయానుకూల పరిష్కారం దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు.

Related posts

విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం… సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం

TV4-24X7 News

తారా స్థాయికి ఏపీ రాజకీయాలు.. ఉత్కంఠ రేపుతున్న సర్వేలు..

TV4-24X7 News

వైసీపీ ఓడితే : పార్టీలో చీలిక ఖాయం.. టాప్ లీడ‌ర్లు జంప్‌…!

TV4-24X7 News

Leave a Comment