Tv424x7
Andhrapradesh

వైసీపీపై మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలుమంత్రి నారా లోకేష్..

వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి పరకామణి సొత్తు దోపిడీకి సంబంధించి వీడియోలు బయటపడ్డాయని తెలిపారు. వంద కోట్ల రూపాయల పరకామణి దోపిడీ వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని ఆరోపించారు.

ఎక్స్‌లో పోస్ట్ చేసిన లోకేష్, “నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ చేశారు” అని వ్యాఖ్యానించారు.

తాడేపల్లి ప్యాలెస్‌, భూమన అండతోనే ఈ దోపిడీ జరిగిందని లోకేష్ ఆరోపించారు. చోరీ చేసిన డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మారిందని అన్నారు. రవికుమార్‌ దోపిడీ సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన ఉన్నారని గుర్తుచేశారు.

ఈ కేసును భూమన అనుచరులు లోక్ అదాలత్‌లో రాజీకి యత్నించారని లోకేష్ ఎత్తిచూపారు. “లడ్డూను కల్తీ చేశారు, అన్నప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు” అని మండిపడ్డారు.

Related posts

కమల్ హాసన్ విజయం కోసం విజయ్‌కు సూచనలు!!

TV4-24X7 News

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక అక్రమాలపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు

TV4-24X7 News

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా..మాజీ మంత్రిఅంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..

TV4-24X7 News

Leave a Comment