Tv424x7
Andhrapradesh

బద్వేలు పరిధిలో బస్సు బోల్తా…

కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలో శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది. బద్వేల్ నుంచి మైదుకూరు మీదుగా కడపకు వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు వరదాయపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 30మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమయానికి బస్సు నెమ్మదిగా వెళ్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ట్విట్టర్(X)లో న్యూడ్ వీడియోలతో భారీ మోసం

TV4-24X7 News

ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్

TV4-24X7 News

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

TV4-24X7 News

Leave a Comment