నంద్యాల జిల్లా మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యగుల రిలే నిరాహార దీక్షలు.
• నంద్యాల పట్టణంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.
• 1-2-1999 నుండి 1-8-2004 వరకు ఈపీఎఫ్ టు జిపిఎఫ్ వెంటనే అమలు చేయాలన్నారు.
•విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు.
• విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే అమలు చేయాలన్నారు.
• గ్రేటులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
• పెండింగ్ డి. ఏ లను వెంటనే చెల్లించాలని నిరసన తెలిపారు.
• ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 30 సంవత్సరాలు నుండి చేస్తున్న వారిని, వారు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నామన్నారు.
• రాష్ట్ర జేఏసీ నాయకులు చర్చకు పిలిచి సమస్యలు తీర్చాలన్నారు పిలవకపోతే విద్యుత్ కార్మికులు చేస్తున్న నిరసన చర్చించకపోతే జేఏసీ నాయకులు ఆలోచించకపోతే సామాన్య విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు.
• జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు.

