హైదరాబాద్ :
పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “OG” ఇంకా థియేటర్లలో రిలీజ్ కాకముందే పైరసీ సైట్ bappam.tvలో “OG – SOON !!!” అంటూ లిస్టింగ్ పెట్టడం సంచలనం రేపుతోంది.
ఇటీవలి కాలంలో iBomma, Bappam వంటి వెబ్సైట్లు సినిమాలు విడుదల రోజునే ఆన్లైన్లో లీక్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి భారీ నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పుడు OG మూవీని లక్ష్యంగా పెట్టుకోవడం నిర్మాతలలో ఆందోళన కలిగిస్తోంది.
.సినిమా టీం ఇప్పటికే పైరసీని అరికట్టడానికి ప్రత్యేక యాంటీ-పైరసీ స్క్వాడ్‌ను నియమించింది. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ఫిల్మ్ చాంబర్ తరఫున మాట్లాడుతూ అధికారులు – “సినిమా ఇంకా థియేటర్లకు రాకముందే పైరసీ సైట్లు ఇలాంటివి చేయడం చట్టబద్ధం కాదు. OG వంటి భారీ ప్రాజెక్టులు లీక్ అయితే పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది” అని హెచ్చరించారు.
ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్స్ పెడుతూ, “Say No to Piracy – Save Cinema” అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

