హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా
కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడి, ఏర్పడినప్పటి నుంచి ₹50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి విడిపించామని ఆయన వెల్లడించారు.
కమిషనర్ వివరాల ప్రకారం, నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయి, వీటిలో ఆరు చెరువులకు పూర్తిస్థాయిలో పునరుజ్జీవన ఏర్పాట్లు చేశారు. గాజులరామారంలో కొన్ని రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని గుర్తించి, ఆదివారం అక్కడున్న ఆక్రమణలను తొలగించారు. నకిలీ పట్టాలు సృష్టించి నిర్మించిన 260 నిర్మాణాలను కూడా తొలగించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం 51 డీఆర్ఎఫ్ బృందాలు కార్యకలాపాలలో ఉన్నాయీ, వాటిని త్వరలో 72 బృందాలుగా పెంచనున్నారు. అదనంగా, నగరంలో 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు.
రంగనాథ్, అధిక కాలుష్యం కారణంగా నగరాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయని, భవిష్యత్తులో యువత పార్కులు, చెరువుల పరిరక్షణ గురించి ఆలోచించడం అవసరమని సూచించారు.

